ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

కోలుకున్న విరాట్ కోహ్లీ.. ఇక ఐపీఎల్‌లో మెరుపులు.. ఫ్లైయింగ్ కిస్‌లేనా?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ సాధించాడు. గత నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో కోహ్లీ గాయపడిన విషయం తెల్సిందే. ఆ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్‌కు కూ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ సాధించాడు. గత నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో కోహ్లీ గాయపడిన విషయం తెల్సిందే. ఆ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉన్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ పదో అంచె పోటీలకు కూడా దూరంగానే ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఫలితంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ బరిలోకి దిగుతాడని బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.
 
ప్రస్తుతం కోహ్లీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడని ఓ ప్రకటనలో పేర్కొంది. కుడి భుజానికి తగిలిన గాయం పూర్తిగా మానిందని తెలిపింది. కాగా, నిన్ననే కోహ్లీ కాసేపు మైదానంలో ప్రాక్టీస్ చేసిన విషయం తెల్సిందే. కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్‌గా ఉన్న విషయం తెల్సిందే.