సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (19:09 IST)

ఒకే ప్లేటులో తింటున్న కేదర్ జాదవ్-ధోనీ.. ధోనీకి తినిపిస్తూ.. (Viral Video)

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ, కేదర్ జాదవ్ ఒకే ప్లేటులో తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ను ఎంపిక చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది.
 
చెన్నై జట్టు తరపున రైనా, జడేజా అద్భుతంగా రాణించారు. దీంతో 19.4 ఓవర్లలో ఐదు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు డిన్నర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ధోనీ, కేదర్ జాదవ్ ఒకే ప్లేటులో తిన్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియోను కేదర్ జాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు. ధోనీకి తినిపిస్తూ.. తాను తింటూ వున్న కేదర్ జాదర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.