శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (20:50 IST)

కొత్త జెర్సీల్లో మెరిసిపోతున్న చెన్నై సూపర్ కింగ్స్... (Video)

ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఈ జట్టు ఐపీఎల్‌-2020 ప్రారంభానికి ముందే సీఎస్‌కే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కానీ జట్టు ఫ్రాంచైజీ మాత్రం త్వరలో అన్నీ సర్దుకుంటాయని చెప్తూ వస్తోంది. 
 
ఈ జట్టు ఆటగాళ్లు కూడా సెప్టెంబర్‌ 19న ముంబైతో జరుగనున్న తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే మంగళవారం తమ తాజా జెర్సీకి సంబంధించిన వీడియోను అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
 
ఈ వీడియోలో ఎంఎస్ ధోని, షేన్ వాట్సన్, మురళీ విజయ్ కాలర్‌ ఎగరేస్తూ వేసిన స్టెప్‌ చెన్నై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియో పోస్టు చేసిన నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి.  
 
కాగా, ఈ నెల 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభమవుతుంది. ఇది నంవబరు 10తో ముగియనుంది. ఇందుకోసం ఎనిమిది జట్లు ఇప్పటికే యూఏఈకి చేరుకునివుని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.