శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (17:15 IST)

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ఫెస్టివల్

IPL 2021
క్రికెట్ అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు అభిమానులను అనుమతిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది. కరోనా కారణంగా ఐపీఎల్ 2021కు మధ్యలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్నాయి.
 
ఈ టోర్నిలో మిగిలిన మ్యాచ్‌లు దుబాయ్, షార్జా, అబుదాబి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. అయితే కోవిడ్ నిబంధనలు, యూఏఈ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా పరిమిత సిట్టింగ్‌తో అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.
 
కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్ మ్యాచ్ అభిమానుల సందడి మధ్య జరగనుంది. 
 
ఈ మ్యాచ్‌తో పాటు టోర్నిలో మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు సెప్టెంబర్ 16 నుంచి ఆన్‌లైన్ అందుబాటులో ఉండనున్నాయి. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్‌లలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.