తొడకు గాయం.. ఐపీఎల్‌తో పాటు WTC Finalకు కేఎల్ రాహుల్ దూరం..
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ప్రముఖ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన కేఎల్ రాహుల్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. లక్నోకు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తుండగా తొడకు గాయమైంది.
ఈ గాయం కారణంగా రాహుల్ ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇంతలో స్కానింగ్ కోసం ముంబై వెళ్లాడు. వైద్యులు రాహుల్‌కు శస్త్రచికిత్స అవసరమని తెలియజేసినట్లు లక్నో టీమ్ నిర్వాహకులు వెల్లడించారు.
ప్రస్తుతం గాయంతో చికిత్స పొందుతున్న కేఎల్ రాహుల్ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడడని ప్రకటించారు. అంతేగాకుండా.. వచ్చే నెలలో లండన్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి కూడా కేఎల్ రాహుల్ వైదొలిగాడు.