ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీ ఖచ్చితంగా ఆడగలడు... అనిల్ కుంబ్లే
ఐపీఎల్ 2024 సీజన్‌లో ధోనీ ఖచ్చితంగా ఆడగలడని, ఐపీఎల్ 2025లో కూడా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అన్నాడు. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ అందుకు అతడు సిద్ధంగా లేదని తాను భావిస్తున్నట్టు మాజీ లెగ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు.
ఎంఎస్ ధోనీ అందరితో కలిసిపోవాలని కోరుకునే ఆటగాడని, ఈ విషయంలో ధోనీ, సచిన్ టెండూల్కర్ ఒకటేనని కుంబ్లే పోల్చాడు. ఐపీఎల్‌లో తానెప్పుడూ ఎంఎస్ ధోనీతో ఆడలేదని, అయితే భారత జట్టులో ఆడేటప్పుడు తనను పైకి లేపిన మొదటి వ్యక్తి ధోనీయే అని కుంబ్లే గుర్తుచేసుకున్నాడు.