శుక్రవారం, 12 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (21:04 IST)

మనోళ్లు ఓడిపోయారు.. అంత డబ్బు పెట్టినా హారీ బ్రూక్‌ రాణించలేదే!

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్-16లో వరుసగా రెండోసారి చవిచూసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు సాధించింది. లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి విజయం అందుకుంది. 
 
మరోవైపు గతేడాది డిసెంబరులో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ యువ ఆటగాడు హారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 
 
గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్‌ నాలుగు బంతులు మాత్రమే ఆడి మూడు పరుగులు చేసి అవుటయ్యాడు. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేశాడు. దీనిని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు అతడిపై ట్రోల్స్ మొదలుపెట్టారు.