శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మే 2020 (19:10 IST)

వర్క్ ఫ్రమ్ హోమ్‌ వారికి.. ఎయిర్‌టెల్ డబుల్‌ డేటా ప్లాన్

కరోనాతో లాక్ డౌన్‌తో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు.. డేటాను వినోదం కోసం తెగ వాడేస్తున్న వారు అధికమవుతున్నారు. దీన్ని క్యాష్ చేసేందుకు టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వున్న వారికి కోసం జియో కొత్త రీఛార్జ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ వినియోగదారులకు డబుల్‌ డేటా ఇస్తోంది.
 
ఇప్పటి వరకూ రూ.98తో రీఛార్జ్‌ చేసుకుంటే 6జీబీ డేటా మాత్రమే ఇస్తున్నారు. ఇక నుంచి 12జీబీ డేటా పొందవచ్చు. ఈ రీఛార్జి కాల పరిమితి 28 రోజులు. ఇక ఎలాంటి అదనపు ప్రయోజనాలు అందవు. దీనితో మూడు రీఛార్జి ఓచర్లపై టాక్‌టైమ్‌ను పెంచింది. రూ.500 పెట్టి రీఛార్జి చేస్తే ప్రస్తుతం రూ.423.73 టాక్‌టైమ్‌ లభిస్తుండగా, ఈ మొత్తాన్ని రూ.480కి పెంచింది. 
 
అలాగే రూ.1000తో రీఛార్జి చేస్తే రూ.847.46 టాక్‌టైమ్‌ వస్తుండగా ఇప్పుడు దానిని రూ.960కు పెంచారు. ఇక రూ.5000లతో రీఛార్జ్‌ చేసుకునే వినియోగదారులకు రూ.4,800 టాక్‌టైమ్‌ లభించనుంది.