సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (12:56 IST)

టెలికాం సంస్థలకు సుప్రీంలో షాక్.. బకాయిల చెల్లింపు విషయంలో సీరియస్

అడ్జెస్టెడ్‌‌ గ్రాస్‌‌ రెవెన్యూ (ఏజీఆర్‌‌) బకాయిల చెల్లింపు విషయంలో టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. బకాయిలు కట్టనందుకు జడ్జీలు టెల్కోలపై, డాట్​పై మండిపడ్డారు. వీటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డాట్‌‌ ఆఫీసర్లను నిలదీశారు. దీంతో బకాయిలు వెంటనే కట్టాలని డాట్​ టెల్కోలను ఆదేశించింది. ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియాపై కోర్టను ధిక్కరించినట్టుగా కోర్టు తేల్చింది. 
 
తదుపరి విచారణ జరిగే మార్చి 17న టెల్కోల, డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికం (డాట్‌‌) ఎండీ, టాప్‌‌ అఫీషియల్స్‌‌ స్వయంగా రావాలని ఆదేశించింది. టెల్కోలు ఈ ఏడాది జనవరి 23 నాటికి రూ.లక్ష కోట్లకుపైగా ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించాలంటూ తాము ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదంటూ డాట్‌‌ను కోర్టు మందలించింది. 
 
ఇది వరకే వేల కోట్ల రూపాయల అప్పులతో సతమతమవుతున్న టెల్కోలకు సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర ఇబ్బందికరమేనని టెలికాం ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించకపోతే వొడాఫోన్‌‌ ఐడియా మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.