సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (16:00 IST)

అమేజాన్‌లో 110,000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు

Amazon
రాబోయే పండుగ సీజన్‌ను పురస్కరించుకుని 110,000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలను సృష్టించినట్లు అమేజాన్ ఇండియా గురువారం ప్రకటించింది. 
 
ఈ ఇ-కామర్స్ మేజర్ వేల మంది మహిళా సహచరులతో పాటు దాదాపు 1900 మంది వికలాంగులను (PWD) దాని ప్రస్తుత నెట్‌వర్క్‌లోకి నియమించుకుంది. ఈ కొత్త ఉద్యోగులలో ఎక్కువ మందిని ఇప్పటికే ఆన్‌బోర్డ్ చేసినట్లు కంపెనీ తెలిపింది.
 
ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. అమెజాన్ ఇండియా వీపీ-ఆపరేషన్స్, అభినవ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ అసోసియేట్‌లలో చాలా మంది పండుగ సీజన్ తర్వాత కూడా అమెజాన్‌తో పని చేస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇంకా చాలా మంది అమెజాన్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా వున్నారు. ఇందులో భాగంగా భారతదేశం అంతటా 1 లక్షకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించడానికి సిద్ధంగా వుంది.