ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (12:01 IST)

147 సంవత్సరాల క్రికెట్ చరిత్ర.. సచిన్ రికార్డుకు 58 పరుగుల దూరంలో కోహ్లీ

virat kohli
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందానని ఎదురుచూస్తున్నారు.. కోహ్లీ అభిమానులు. 
 
ఎందుకంటే..? విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ మధ్య పోలికలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో కోహ్లి 80 అంతర్జాతీయ సెంచరీలు కలిగి ఉన్నాడు. సెంచరీల సంఖ్య పరంగా టెండూల్కర్ (100) తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు. ఆ ఫీట్‌ను అధిగమించడానికి కొంత సమయం పట్టవచ్చు. 
 
అయితే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు కోసం కోహ్లీ టెండూల్కర్‌ను అధిగమించగలడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీకి 58 పరుగులు అవసరం. 
 
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన సచిన్ - 623 ఇన్నింగ్స్‌లు (226 టెస్టు ఇన్నింగ్స్‌లు, 396 ODI ఇన్నింగ్స్‌లు, 1 T20I ఇన్నింగ్స్)ల్లో ఈ ఫీట్ సాధించాడు. అలాగే కోహ్లి ఇప్పటి వరకు ఫార్మాట్‌లలో 591 ఇన్నింగ్స్‌లు ఆడి 26942 పరుగులు చేశాడు. 
 
కోహ్లి తన తదుపరి ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 58 పరుగులు సాధించగలిగితే ఈ ఫీట్‌ను అధిగమించే  అవకాశం ఉంది. కోహ్లీ 147 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 27,000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తాడు.