ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (13:56 IST)

విరాట్ కోహ్లీ ఆలోచనలు ఎపుడూ ఆస్ట్రేలియన్ల తరహాలో ఉంటాయి : స్టీవ్ స్మిత్

virat kohli
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ ఆలోచనలు, చేతలు ఎల్లవేళలా ఆస్ట్రేలియన్ క్రికటర్ల తరహాలో ఉంటాయని అన్నారు. అందుకే తన దృష్టిలో విరాట్ కోహ్లీ ఓ బ్యాటింగ్ దిగ్గజం అని వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, విరాట్ కోహ్లీ ఆలోచనలు, చర్యలో ఆస్ట్రేలియన్ అని నేను నమ్ముతున్నాను. అతను మ్యాచ్ ఆడే విధానం, సవాలును ఎదుర్కొనే తీరు, ప్రత్యర్థిని అధిగమించడానికి ప్రయత్నించే విధానం.. ఇలా ప్రతి విషయంలో అతను భారతీయ ఆటగాళ్లలో ఆస్ట్రేలియన్ను గుర్తు చేస్తాడు. అందుకే కోహ్లీ ఆటను నేను ఇష్టపడతాను. మీరు కాదంటారా చెప్పండి" అని స్మిత్ తన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. 
 
"అసలు విరాట్‌ను అధిగమించాలని ఎప్పుడూ అనుకోను. కేవలం నా ఆటపై మాత్రమే దృష్టిపెడతాను. చేయగలిగినన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాను. తద్వారా ఆస్ట్రేలియాకు విజయం సాధించడంలో సహాయపడటం గురించి మాత్రమే ఆలోచిస్తాను" అని స్మిత్ అన్నాడు.