ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 జూన్ 2017 (10:05 IST)

అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు.. ఐస్ బ్రాండ్‌‌తో మార్కెట్లోకి..

ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు లక్ష్యంగా గూగుల్‌ కొత్త ఆన్‌డ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో స్మ

ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ సొంత బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు లక్ష్యంగా గూగుల్‌ కొత్త ఆన్‌డ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనుంది. ఐస్ బ్రాండ్‌తో వీటిని విడుదల చేసేందుకు భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఫీచర్స్ సంగతికి వస్తచే 
5.2-5.5 అంగుళాల స్క్రీన్‌తో 13 ఎంపీ కెమెరా
గూగుల్‌ అసిస్టెంట్‌తో ఆన్‌డ్రాయిడ్‌ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ మెమరీ,
ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ 
 
ఇంకా జీమెయిల్, గూగుల్‌ ప్లే వంటి గూగుల్‌ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌ ఇవ్వనుంది. దీని ధర రూ.6,000 ఉండొచ్చని సమాచారం. 2014లో అమెజాన్‌ ఫైర్‌ ఫోన్‌ పేరుతో ఆన్‌డ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.