ఫ్లిఫ్ట్‌కార్ట్‌లో అసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ఎమ్2 సేల్..
భారత్‌లో తొలిసారిగా అసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ఎమ్2 విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా గురువారం నుంచి ఈ విక్రయాలు వుంటాయని సంస్థ వెల్లడించింది. గతవారంలో అసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ఎమ్‌ను సంస్థ విడుదల చేసింది. ఈ ఫోన్‌లో సూపర్ ఫీచర్స్ వున్నాయి. లార్జ్ డిస్‌ప్లే, లార్జ్ బ్యాటరీ, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, ఎల్ఈడీ ఫ్లాష్ మోడల్ వంటి ఫీచర్స్‌తో కూడిన ఈ ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా పొందవచ్చు.
భారత్ మార్కెట్లో అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2 ధరెంతంటే..?
3జీబీ రామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌తో కూడిన అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2 ధర రూ.9,99 పలుకుతోంది. 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో కూడిన అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2 ధర రూ.11,999 ప్రారంభం అవుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫ్లిఫ్‌కార్టులో అందుబాటులో వుంటుంది. హెచ్డీఎఫ్‌సీ కార్డులపై రూ.750 డిస్కౌంట్‌ను కూడా ప్రకటించారు.
అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2 ఫీచర్స్
డుయెల్ సిమ్ (నానో),
అసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ఎమ్ 2 (జెడ్బీ63కెఎల్)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఇది పనిచేస్తుంది.
స్పోర్ట్స్ 6.26- ఇంచ్ హెచ్డీ ప్లస్ (720x1520 పిక్సెల్స్)
2.5 కర్వ్డ్ గ్లాస్