టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకుంటే.. కోహ్లీలా చొక్కా విప్పేసి పరుగులు పెడతా..?

Last Updated: బుధవారం, 19 డిశెంబరు 2018 (11:09 IST)
బ్రిటన్‌లో వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ పోటీల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో భారత్ గెలిస్తే తానేం చేస్తానో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవి చెప్పారు. టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే.. తాను ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో చొక్కా తీసేసి పరుగులు పెడతానని ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన మాటను కపిల్ దేవ్ గుర్తు చేశారు. 
 
కోహ్లీ లాగానే తాను కూడా షర్ట్ విప్పేసి పరుగులు పెడతానని స్పష్టం చేశారు. ఈ దేశం కోసం తాను ఏం చేసేందుకైనా సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చారు. 2019 ప్రపంచ కప్‌ను భారత్ గెలుస్తుందని.. తన మెదడు, హృదయం చెప్తుందన్నారు. ఈ టోర్నీలో టీమిండియా క్రికెటర్లు మెరుగ్గా ఆడాల్సి వుందని, తద్వారా గెలుపును నమోదు చేసుకుని.. విజేతగా నిలవాలని ఆశిస్తున్నట్లు కపిల్ దేవ్ ఆకాంక్షించారు.దీనిపై మరింత చదవండి :