బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (12:07 IST)

చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ స్కామ్‌.. 12చోట్ల ఈడీ సోదాలు

చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎనిమిది రోజుల పాటు విచారించనున్న ఈడీ వారి నుండి విషయాలని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, చైనాకు చెందిన లిన్ యాంగ్ హులను కస్టడీకి ఈడీ కోర్ట్ అనుమతి ఇచ్చింది. చైనాకు చెందిన మింగ్ యాంగ్, జింగ్ యాంగ్‌తో పాటు ఢిల్లీ కిచెందిన నీరజ్ కుమార్ కీలక సూత్రధారులని ఈడీ చెబుతోంది.
 
మనీ ల్యాండరింగ్ కేసులో నిందితులపై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా విస్తరించిందని గుర్తించారు. ఏడాదిలో ఇండియాలో రెండు వేల కోట్ల లావాదేవీలు సాగించినట్టు చెబుతున్నారు. రూ.100 కోట్ల మేరకు చైనాకు తరలించినట్టు గుర్తించారు. 
 
ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, పూణేలో దేశవ్యాప్తంగా 12చోట్ల ఈడీ సోదాలు చేసి నాలుగు హెచ్ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాల్లో 47 కోట్లు సీజ్ చేసింది. 17 హార్డ్‌డిస్క్‌లు, 5 లాప్‌టాబ్స్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ కంపెనీ ఇండియాలో ఈ కామర్స్ పేరుతో వందలాది బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.