బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (16:50 IST)

2026 నాటికి హ్యూమనాయిడ్ రోబోల ఉత్పత్తి- ఎలెన్ మస్క్

elon musk
ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేసే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు ఎలెన్ మస్క్. టెస్లా 2026 నాటికి ఈ రోబోట్‌లను భారీగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో ఈ మేరకు ప్రకటన కూడా విడుదలైంది.

ఎలెన్ మస్క్ మొదటిసారిగా ఆప్టిమస్ ప్రాజెక్ట్‌ను గత సంవత్సరం బంబుల్బీ అనే ప్రోటోటైప్‌తో అందించారు. ఇటీవల, టెస్లా సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ టీ- షర్టును మడతపెట్టే తదుపరి తరం రోబోట్ వీడియోను ప్రదర్శించింది.
 
హోండా, హ్యుందాయ్ బోస్టన్ డైనమిక్స్ వంటి సంస్థలచే హ్యూమనాయిడ్ రోబోట్‌లు చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చేశాయి. కార్మికుల కొరతను పరిష్కరించడం, వివిధ ఉద్యోగాలలో భద్రత సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ రోబోలు పనిచేస్తాయి.
 
టెస్లా ఈ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఊహించిన రోబోటాక్సీ డిజైన్‌కు గణనీయమైన మార్పులు అవసరమని, దాని విడుదల జాప్యం అవుతుందని ఎలెన్ మస్క్ తెలిపారు.