వాట్సాప్ సాంకేతిక లోపం టెలిగ్రాంకు అలా కలిసొచ్చింది
వాట్సాప్ సాంకేతిక లోపం టెలిగ్రామ్‌కు కలిసొచ్చింది. ఇప్పటివరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వాట్సాప్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ను 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తుండగా టెలిగ్రామ్‌ను కేవలం 10 కోట్ల మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు.
బుధవారం ఫేస్‌బుక్ మెసేజింగ్ యాప్, వాట్సాప్ రెండూ సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో యూజర్లు భారీ సంఖ్యలో టెలిగ్రాం యాప్ వైప్ మళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా టెలిగ్రాం వెల్లడించింది. బుధవారం నాడు కొన్ని గంటల వ్యవధిలో వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవలు నిలిచిపోవడంతో ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు 30 లక్షల మంది కొత్త యూజర్లు టెలిగ్రాం నెట్‌వర్క్‌లో చేరారని టెలిగ్రాం సంస్థ తెలిపింది.
వాట్సాప్‌కు పోటీగా ఎంట్రీ ఇచ్చిన టెలిగ్రాంకు మొదట్లో బాగా ఆదరణ ఉన్నప్పటికీ సరికొత్త ఫీచర్లతో వాట్సాప్ దూసుకుపోవడంతో బాగా వెనుకబడింది. ప్రస్తుతం టెలిగ్రాం 10 కోట్ల మంది వినియోగదారులతో ఉంది. ఫేస్‌బుక్ యాజమాన్యంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లకు బుధవారం నాడు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కొన్ని కోట్ల మంది యూజర్లు ఫిర్యాదులు చేసారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ కూడా ధృవీకరించింది. అయితే గురువారం ఉదయానికల్లా సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది.