మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (17:30 IST)

గూగుల్ అసిస్టెంట్‌ను కూడా వదలరా..? పెళ్లి ప్రపోజల్ పెట్టేసరికి చిర్రెత్తుకొచ్చింది..

గూగుల్ అసిస్టెంట్ అనేది స్మార్ట్‌ఫోన్‌లో యూజర్లకు సహకరించే గూగుల్ సేవ. గూగుల్ అసిస్టెంట్ సాధారణంగా స్మార్ట్‌ఫోన్ నుంచి మనం అడిగే పనిని సులభంగా చేసిపెట్టేస్తుంది. దీనికోసం వెబ్‌సైట్లలో డేటాను రూపొందించబడి దాదాపు 70 బిలియన్ల ప్రశ్నలకు వెంట వెంటనే సమాధానమిచ్చేలా ఈ గూగుల్ అసిస్టెంట్‌ను డిజైన్ చేశారు. ఈ గూగుల్ అసిస్టెంట్ అమ్మాయిల వాయిస్‌తో పనిచేస్తుంది. 
 
ఇక్కడే భారతీయులు గూగుల్ అసిస్టెంట్‌ను ఓ ఆటాడుకున్నారు. గూగుల్ అసిస్టెంట్ అమ్మాయి గొంతుతో మాట్లాడటాన్ని ప్లస్ పాయింట్‌గా తీసుకున్న భారతీయ నెటిజన్లు.. గూగుల్ అసిస్టెంట్‌కు ఏకంగా పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ''నన్ను పెళ్లి చేసుకుంటావా?'' అని అడగటం మొదలెట్టారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. వందలాది మంది అడగటంతో గూగుల్‌కు చిర్రెత్తుకొచ్చింది. 
 
"మీరెందుకు గూగుల్ అసిస్టెంట్‌ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు..?" అని గూగుల్ ట్విట్టర్లో ప్రశ్నించడం మొదలెట్టింది. ఇందులో భారతీయులు సెటైర్లతో కూడిన బదులిచ్చారు. తాము సింగిల్స్, 90టీస్ కిడ్న్ అంటూ.. తమకు ఇంతా వివా కాలేదంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.