మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (13:12 IST)

వాట్సాప్ ద్వారా వైరస్ ఫైల్స్.. జరజాగ్రత్త.. కేంద్ర భద్రతా ఏజెన్సీల హెచ్చరిక

దేశంలో రెండు సంచలనాత్మక వైరస్ ఫైల్స్ భారీగా షేర్ అవుతున్నాయని కేంద్ర భద్రతా ఏజెన్సీలు హెచ్చరించాయి.దీంతో సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్‌పై కేంద్ర భద్రతా ఏజెన్సీలు హై అలర్ట్ ప్రకటించాయి. వాట్సాప్ ద్వారా

దేశంలో రెండు సంచలనాత్మక వైరస్ ఫైల్స్ భారీగా షేర్ అవుతున్నాయని కేంద్ర భద్రతా ఏజెన్సీలు హెచ్చరించాయి.దీంతో సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్‌పై కేంద్ర భద్రతా ఏజెన్సీలు హై అలర్ట్ ప్రకటించాయి. వాట్సాప్ ద్వారా అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.

ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), ఎన్ఐఎ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పేరుతో ప్రమాదకరమైన ఈ ఫైల్స్ షేర్ అవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ హానికరమైన ఫైల్స్ ఎంఎస్ వర్డ్ లేదా పీడీఎఫ్ ఫార్మాట్లలో కూడా ఉండే అవకాశాలు ఉండవచ్చని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 
 
ఈ మేరకు గత సంవత్సరం డిసెంబర్ 30న రక్షణ, భద్రతా సంస్థలకు హై అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా డిఫెన్స్,  సెక్యూరిటీ పారామిలీటరీ, పోలీస్ విభాగంలోని సిబ్బంది (స్త్రీ, పురుషులను) టార్గెట్ చేసుకుని ఈ అనుమానాస్పద ఫైల్స్ రొటేట్ అవుతున్నట్లు భద్రతా ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

వీటి ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ డేటాను హ్యాక్ చేయవచ్చని, వినియోగదారుల ఫోన్, డేటాపై దాడిచేసే ఈ వైరస్ మెసేజ్‌ల ద్వారా బ్యాంకింగ్ పాస్ వర్డ్స్, పిన్ లాంటి ఇతర వివరాలు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.