శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (16:06 IST)

22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించిన భారత్

youtube
కేంద్ర ప్రభుత్వం 22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన వాటిలో 18 దేశీయ యూట్యూబ్ చానళ్లు కాగా, 4 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లు. దేశభద్రత, ప్రజాక్షేమం దృష్ట్యా నిషేధించినట్టు కేంద్రం వెల్లడించింది. 
 
యూట్యూబ్ చానళ్లనే కాకుండా 3 ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్ సైట్ ను కూడా నిషేధించినట్టు తెలిపింది.
 
దేశ భద్రత దృష్ట్యా కేంద్ం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా యూట్యూబ్ చానళ్లు టీవీ చానళ్ల లోగోలు వాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని వివరించింది. 
 
డిజిటల్ మీడియా ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 35 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని జనవరిలో మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు ఐ అండ్ బి కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.
 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని అత్యవసర నిబంధనల కింద సదరు ఛానళ్లను బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చంద్ర తెలిపారు.