1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (20:03 IST)

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై రూ.14 వేల డిస్కౌంట్

iphone13
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తయారు చేసిన ఐఫోన్ 14 మ్యాక్స్ వచ్చే నెలలో భారతీయ మార్కెట్‌లోకి అందుబాటులోకిరానుంది. ఈ తరుణంలో ఐఫోన్ 13కు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు చేసేవారికి ఏకంగా 14 వేల రూపాయల మేరకు డిస్కౌంట్ లభించనుంది. భారత్‌లో తమ డ్రీమ్ ఫోనును సొంతం చేసుకునేందుకు ఐఫోన్ కస్టమర్లకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఐఫోన్ 13 128 జీబీ మోడల్‌పై ఈ రాయితీని ఇవ్వనుంది. 
 
వాస్తవానికి భారతీయ మార్కెట్‌లో ఈ ఫోన్ ధర రూ.79990గా ఉంది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ధర రూ.65999గా ఉంది. కానీ, హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు వెయ్యి రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది. దీంతో రూ.64999కు లభ్యంకానుంది. 
 
ఇక పాత్ ఫోనును మార్పిడి చేసుకునేవారికి ఐఫోన్ 13 మరింత తక్కువకే సొంతంకానుంది. పాత ఫోన్‌పై ఈ కామర్స్‌ దిగ్గంజ రూ.19 వేల వరకు ఆఫర్ ఇవ్వనుంది. అయితే, మార్పిడి చేసే ఫోన్ కండిషన్ ఆధారంగా ఈ మార్పిడి మదింపు విలువ మారుతుంది.