శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (11:33 IST)

కొనసాగుతున్న జియో జోరు: డౌన్‌లోడింగ్ స్పీడులో అగ్రస్థానం

ఉచిత డేటాతో పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 4జీ బ్రాండ్‌బ్యాండ్ సేవల జోరును కొనసాగిస్తోంది. తద్వారా జియో డౌన్‌లోడింగ్ స్పీడులో 11వసారి వరుసగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జియ

ఉచిత డేటాతో పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 4జీ బ్రాండ్‌బ్యాండ్ సేవల జోరును కొనసాగిస్తోంది. తద్వారా జియో డౌన్‌లోడింగ్ స్పీడులో 11వసారి వరుసగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జియోకు తర్వాత వొడాఫోన్ రెండో స్థానంలోనూ, భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యూలార్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 
 
2017 నవంబరు నెలలో డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌లో 25.6 మెగాబైట్ల వేగంతో జియో వేగం నమోదైందని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. జియోకు పోటీదారి అయిన వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్, భారతీ ఎయిర్‌టెల్‌ 9.8 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 7 ఎంబీపీఎస్‌  వేగాన్ని అందించాయి. అప్‌లోడ్‌  వేగంలో ఐడియాను వెనక్కినెట్టి వోడాఫోన్ నవంబరులో 6.9 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసుకుందని ట్రాయ్ వెల్లడించింది.