శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 జులై 2017 (10:20 IST)

ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటో ఈ-4 భారీ సేల్.. 24 గంటల్లోనే లక్ష ఫోన్లు అమ్ముడుబోయాయి..

ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంచిన ‘మోటో ఈ 4’ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు కేవ‌లం 24 గంట‌ల్లోనే లక్ష అమ్ముడుపోయాయి. లెనోవో ఇటీవ‌లే మోటరోలా బ్రాండ్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో జులై 12న ‘మోటో ఈ 4’ పేరిట

ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంచిన ‘మోటో ఈ 4’ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు కేవ‌లం 24 గంట‌ల్లోనే లక్ష అమ్ముడుపోయాయి. లెనోవో ఇటీవ‌లే మోటరోలా బ్రాండ్‌ను  సొంతం చేసుకున్న నేపథ్యంలో జులై 12న ‘మోటో ఈ 4’ పేరిట కొత్త మోడ‌ల్‌ను విక్ర‌యానికి ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్లు తొలి గంటలో నిమిషానికి 580 అమ్ముడయ్యాయని కూడా ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో సామ‌ర్థ్యంతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.8,999గా ఉంది.
 
‘మోటో ఈ 4’ ఫీచ‌ర్ల సంగతికి వస్తే.. 
మీడియాటెక్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
3 జీబీ ర్యామ్‌
32జీబీ అంతర్గత మెమొరీ
13 మెగాపిక్సల్‌ కెమెరా
5.5 అంగుళాల స్క్రీన్‌
2.5డి కర్వ్‌డ్‌ గ్లాస్
ఎల్‌ఈడీ ఫ్లాష్‌
5 ఎంపీ ముందు కెమెరా
 
మరోవైపు మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఈ4 ప్లస్‌ను విడుదల చేసింది. రూ.9,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. ఈ సందర్భంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు పలు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 
 
ఈ డివైస్‌లో ఐడియా ప్రీపెయిడ్ సిమ్‌ను వేసుకుని రూ.443తో రీచార్జి చేసుకుంటే 84 జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది.  హాట్‌స్టార్ యాప్ ప్రీమియం సేవలు 2 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి.  ఫోన్‌ను కొన్నవారు రూ.749 అదనంగా చెల్లిస్తే రూ.1599 విలువ గల మోటోరోలా పల్స్ 2 హెడ్‌సెట్‌ను పొందవచ్చు.