రూ.3.5లకే ఒక జీబీ డేటా.. రిలయన్స్ జియో కొత్త ఆఫర్
రిలయన్స్ జియో సంస్థ మరో ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ. 3.5లకే ఒక జీబీ డేటా అనేది ఈ ప్రకటన సారాంశం. ప్రముఖ టెలికం సంస్థ జియో తాజాగా రూ. 3.50లకే ఒక జీబీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ జియో రూ. 599 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 84 రోజుల వ్యాలిడిటీనిస్తోంది. రోజూ 2జీబీ డేటానందిస్తోంది. అంటే 84 రోజులకు గానూ మొత్తం 168 జీబీ డేటాను జియో అందించనుంది. ఈ క్రమంలో... ఒక జీబీ డేటాకయ్యే ఖర్చు కేవలం మూడున్నర రూపాయలు మాత్రమే.
ఇతర ప్లాన్‌లతో పోలిస్తే ఈ ప్లాన్ చాలా చౌక అని అర్ధమవుతుంది. ప్రతీరోజు 2జీబీ డేటా అందించే రూ. 249, రూ. 444 ప్లాన్‌ల పోల్చుకుని చూస్తే... ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు ఉండడం విశేషం. అంటే... 56 రోజులకు గానూ మొత్తం 112 జీబీ డేటా కస్టమర్లకు అందిస్తోంది జియో. ఈ క్రమంలో... ఒక జీబీ డేటా దాదాపు రూ. 4 వరకు చెల్లిస్తున్నట్లు లెక్క.
ఇక రూ. 599 ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అంతేకాదు... జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ తదితర యాప్‌లకు ఉచితంగా సబ్ స్క్రిప్షన్ పొందుతారు కూడా. ఇది మరో ప్రత్యేకత అని జియో వర్గాలు చెబుతున్నాయి.