మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (16:26 IST)

వాట్సాప్ యూజర్లకు సైబర్ వార్నింగ్.. ప్రైవసీ పాలసీని యాక్టివ్ చేయకపోతే..?

వాట్సాప్ యూజర్లకు భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సైబర్ ఏజెన్సీ సీఈఆర్‌టీ కోరింది. వాట్సాప్ యాప్‌లో కొన్ని లోపాలను గుర్తించామని, వాటి వల్ల యూజర్ల సమాచారం లీకయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకే లేటెస్ట్ వర్షన్ అప్‌డేట్ చేసుకోవాలని సైబర్ సంస్థ సీఈఆర్‌టీ పేర్కొంది.
 
గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. భారత ప్రభుత్వ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధీనంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పనిచేస్తుంది. కంప్యూటర్ సెక్యూర్టీ సమస్యలు, లోపాలను సరి చేసి దేశవ్యాప్తంగా పటిష్టమైన ఐటీ సెక్యూర్టీ విధానాలు అమలు అయ్యేలా సీఈఆర్‌టీ చూస్తుంది.
 
ప్రస్తుతం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్క దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. అందులో ప్రతి ఒక్కరికి వాట్సప్ ఉంటుంది. ఆ వాట్సప్ కు సంబంధించి కొత్త రూల్స్ ను అంగీకరించకపోతే ఏమవుతుందంటే..
 
సరిగ్గా రెండు నెలల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ పెను దుమారం లేపిన సంగతి అందరికి తెలిసిందే. ఆ పాలసీలో కాస్త మార్పులు చేసి కొత్త పాలసీని ప్రకటించింది ఈ వాట్సప్. ఈ పాలసీని మే 15 లోపు అంగీకరించాలి. ఈ పాలసీ అంగీకరించిన వారు చేయవలసిన పని ఏమీ లేదు. కానీ ఇంకా వాట్సప్ ప్రైవసీ పాలసీని యాక్టివ్ చేయని వారికి మరో నెల రోజులు గడువు ఉంది. 
 
ఇప్పటికే ఈ పాలసీని అంగీకరించని వారికి సందేశాలు పంపిస్తోంది వాట్సాప్. ఒకవేళ మే 15 లోపు వాట్సప్ ప్రైవసీ పాలసీ ని అంగీకరించకపోతే ఏమవుతుంది అన్న సందేశాలు యూజర్లలో ఉన్నాయి. ఒకవేళ మీరు వాట్సప్ కొత్త నిబంధన అంగీకరించకపోతే, కొత్త ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ మీరు ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయినా, ఆ తరువాత 120 రోజుల పాటు మీరు వాట్సాప్ ఉపయోగించుకోవచ్చు. కానీ కొన్ని అప్డేట్ ఫీచర్స్ పనిచేయవు. మీరు నోటిఫికేషన్స్, కాల్ రిసీవ్ చేసుకోవచ్చు, కానీ మెసేజ్ పంపడం అసాధ్యం.
 
మే 15 నుంచి 120 రోజుల వరకు పరిమితమైన ఫ్యూచర్‌తో వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీరు నిబంధనలు అంగీకరించకపోతే వాట్సప్ మీ అకౌంట్‌ను డిలీట్ చేస్తుంది. మరి తిరిగి అదే నెంబర్ మీద వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే, అన్ని మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మీరు మళ్ళీ కొత్త ప్రైవేట్ నిబంధనలను అంగీకరించాల్సిందే. 
 
వాట్సప్ డేటా సెక్యూరిటీ, కమ్యూనికేషన్ సంబంధించి ప్రైవసీ విషయంలో రాజీ పడటం లేదని తెలిపింది. కానీ యూజర్లు డేటాను సేకరించడంతో పాటు థర్డ్ పార్టీ సంస్థలతో షేర్ చేసుకుంటామన్న నియమ నిబంధనలలో ఎలాంటి మార్పులు చేయలేదు. వ్యాపారులతో చాట్ చేసేలా, ప్రశ్నలడిగి సమాధానాలు తెలుసుకొనేలా మార్పులు చేస్తున్నామని, పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్‌కు డేటా షేర్ చేస్తామని తెలిపింది.