గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2017 (11:53 IST)

వూలివ్ నుంచి కొత్త ఫీచర్.. స్ట్రీమింగ్ కోసం ఇంటర్నెట్ అవసరం లేదట..

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ వూలివ్ కొత్త ఫీచర్‌ను వినియోగదారుల అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు వీడియోను పంపించాలనుకుంటే షేరింగ్, గూగుల్ ఫైల్స్ వంటి యాప్‌ల ద్వారా పంపించుకోవాల్సి వచ్చేది. అయితే ఇకపై

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ వూలివ్ కొత్త ఫీచర్‌ను వినియోగదారుల అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు వీడియోను పంపించాలనుకుంటే షేరింగ్, గూగుల్ ఫైల్స్ వంటి యాప్‌ల ద్వారా పంపించుకోవాల్సి వచ్చేది. అయితే ఇకపై వూలివ్ కొత్త ఆన్‌లైన్ ఫీచర్‌ వూషేర్ ద్వారా.. కేవలం డౌన్‌లోడ్ చేసిన వీడియోలను మాత్రమే కాకుండా యూట్యూబ్, వూట్ వంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసుల్లో ప్లే చేసే వీడియోలను కూడా ఇతరుల ఫోన్లకు పంపించే అవకాశం లభిస్తుంది.
 
ఈ ఫీచర్ ద్వారా ఫోటోలు, ఫైళ్లు, వీడియోలను కూడా లోకల్‌గా పంపించుకునే వీలుంటుంది. కాక‌పోతే డేటా మార్పిడి జ‌ర‌గాల్సిన రెండు ఫోన్ల‌లోనూ వూలివ్ యాప్ ఉండితీరాలని సంస్థ వెల్లడించింది. ఒక ఫోన్లో వున్న వీడియోలు, ఫోటోలను మరొకరి ఫోన్లు చూసే వెసులుబాటు ఈ ఫీచర్ ద్వారా కలుగుతుంది. ఈ స్ట్రీమింగ్ కోసం ఎలాంటి ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేదని వూలివ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.