గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (12:31 IST)

జహీర్ ఖాన్, సాగరిక ఘట్కేల రిజిస్టర్ మ్యారేజ్

క్రికెటర్ జహీర్ ఖాన్, నటి సాగరిక ఘట్కేల రిజిస్టర్ వివాహం జరిగింది. నవంబర్ 27న ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ అండ్ ట‌వ‌ర్‌లో వీరి వివాహ రిసెప్ష‌న్ జ‌ర‌గనుంది. వివాహ రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఆహ్వాన‌ప‌త్

క్రికెటర్ జహీర్ ఖాన్, నటి సాగరిక ఘట్కేల రిజిస్టర్ వివాహం జరిగింది. నవంబర్ 27న ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ అండ్ ట‌వ‌ర్‌లో వీరి వివాహ రిసెప్ష‌న్ జ‌ర‌గనుంది. వివాహ రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రిక‌ను సాగ‌రిక స్నేహితురాలు, చ‌క్ దే ఇండియాలో ఆమె స‌హ‌న‌టి విద్యా మాల్వంక‌ర్ షేర్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో నటి సాగరిక, జహీర్ ఖాన్‌ల రిజిస్టర్ వివాహానికి సంబధించిన ఫోటోలను జ‌హీర్ స్నేహితురాలు, ప్రోస్పోర్ట్ ఫిట్‌నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజ‌నా శ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్‌తో షేర్ చేసింది. ఆదివారం మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. సోమవారం వివాహ తంతు ముగిస్తుంది. అదే రోజు సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ వుంటుంది.