Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూజర్ల ప్రైవసీ కోసం త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్

Written By ఠాగూర్
Updated: బుధవారం, 3 జూన్ 2026 (19:38 IST)
ప్రముఖ మెజేసింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకునిరానుంది. వినియోగదారుల భద్రత కోసం స్కామ్‌ అలర్ట్‌ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. తెలియని నంబర్ల నుంచి సందేశాలు వచ్చిన సమయాల్లో యూజర్లను అప్రమత్తం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని వాట్సప్‌ గురించి అప్‌డేట్లు అందించే వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది.
 
ఆ పోస్ట్‌లో పేర్కొన్న అంశాన్ని పరిశీలిస్తే, వాట్సప్‌లో తెలియని నంబర్ల చాట్‌ ఓపెన్‌ చేయగానే ఇది స్కామ్‌ అయ్యుండొచ్చు అని అలర్ట్‌ వస్తుంది. అయితే, వాట్సప్‌ ఆ మెసేజ్‌లను చదవదు. మెటా సర్వర్లకు పంపదు. ఎండ్‌ టు ఎండ్‌ ఇన్‌క్రిప్షన్‌ కొనసాగుతుంది. ఏఐ సాయంతో ఈ ఫీచర్‌ స్కామ్‌ అలర్ట్‌లను పంపిస్తుంది. అయితే, ఆ నంబర్‌ బ్లాక్‌ చేయలా? లేదంటే చాట్‌ కొనసాగించాలా పూర్తిగా యూజర్‌ ఇష్టమని పేర్కొంది.
 
బ్లాక్‌, ట్రస్ట్‌ అనే ఆప్షన్లను మాత్రమే ఇస్తుంది. యూజర్‌ నచ్చిన ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. తెలియని నంబర్ల చాట్‌ నుంచి యూజర్లు మరింత భద్రతగా వ్యవహరించేలా దీన్ని తీసుకొస్తోంది. అయితే, ఇంకా ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సైబర్‌ మోసాల బారి నుంచి రక్షణకు వాట్సప్‌ ప్రైవసీ సెట్టింగ్స్‌లో సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌, బ్లాక్‌ అన్‌నోన్‌ అకౌంట్‌ మెసేజ్‌ ప్రైవసీ ఫీచర్లను అందిస్తోంది.
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

భగవంత్ కేసరి చిత్రం నుంచి ప్రేరణ పొందాం.. నిర్మాత వెంకట్

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments