శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (12:13 IST)

పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు...?

పిల్లలంటే తల్లిదండ్రులకు చెప్పలేనంత ఇష్టం. ప్రపంచంలోని ప్రతి తల్లీతండ్రీ.. తమ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. అలా కోరుకునే వాళ్లంతా జపాన్ చిన్నారుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. వాళ్లు తక్కిన దేశాల పిల్లలతో పోలిస్తే ఆరోగ్యంగా ఉండడమే కాదు.. ఊబకాయం సమస్య తక్కువట. మరి అందుకు కారణాలేంటో తెలుసుకుందాం..
 
పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు వీలైనంతవరకూ చిన్నచిన్న కంచాల్లోనే వడ్డిస్తారు. అయితే పండ్లు, కూరగాయలు మాత్రం పిల్లలు ఎక్కువగా తినేలా చూస్తారు. జపాన్‌లో పిల్లలు చదివే స్కూళ్లు ఇంటికి కాస్త దగ్గరగా ఉండేలా చూసుకుంటారు. అంటే వాళ్లు నడుచుకుంటూనో లేదా సైకిలు మీదో వెళ్తారు. 
 
చిన్నారులు ఖాళీగా ఉన్నప్పుడు కంప్యూటర్‌తోనో, వీడియోగేమ్స్‌తో కాలక్షేపం చేయడం కాకుండా.. ఆరు బయట మైదానంలో ఆడుకునేలా ప్రోత్సహిస్తారు. ప్రతిరోజూ కనీసం ఓ గంటసేపు ఆడుకోవాల్సిందే.. అప్పుడే వారు అన్నీ విషయాలు నేర్చుకుంటారు. 
 
జపాన్‌లో బ్రెడ్, పాస్తా కన్నా అన్నానికి అదీ బ్రౌన్‌రైస్, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకే ప్రాధ్యానం ఇస్తారు. చక్కెర, ఉప్పు ఎక్కువ ఉన్న వాటిని అక్కడ పెద్దలు తినరు. పిల్లలూ ఆ అలవాట్లనే అనుసరిస్తారు. అలానే ఎప్పటికప్పుడు చిన్నారులకు తరచు సరికొత్త పోషకాహారాన్ని పరిచయం చేస్తారు. 
 
హోటళ్లకంటే.. ఇంటి ఆహారానికే ప్రాధాన్యం అక్కడ ఎక్కువట. ఇవన్నీ కలిసే.. ఆ పిల్లలు ఊబకాయం బారిన పడకుండా చేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక మీరు పిల్లల పట్ల కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.