క్రమశిక్షణ లేకపోవడం ఎంత చెడుచేస్తుందో..?
పిల్లలు అబద్దాలాడితే ఇట్టే తెలిసిపోతుంటాయి. ఇప్పుడే ఇన్ని అబద్దాలాడుతావా.. అనే కోపంతో వూగిపోతుంటాం కూడా.. కానీ వాళ్లలా అబద్దాలాడడానికి కారణం మీరేనని ఎప్పుడైనా వూహించారా.. మనం ఒప్పుకోకపోయినా అదే నిజం ఎందుకంటే..
క్రమశిక్షణ లేకపోవడం ఎంత చెడుచేస్తుందో.. అతిక్రమశిక్షణ అంతకంటే ఎక్కువ ప్రతికూలంగా పరిణమిస్తుంది. వాళ్లను మీకంటే కోపిష్టిగా, క్రూరంగా తయారుచేస్తుంది.. లేదా అతిభయస్థులుగా మారుస్తుంది. ఇవన్నీ టీనేజీలో బయటపడుతాయి. క్రమశిక్షణ అన్నది వాహనానికుండే ఓ బ్రేక్‌లాంటిదే.. వాహనానికి అది ముఖ్యమే కానీ.. ఎప్పుడూ బ్రేక్‌లే వేస్తుంటే బండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
టీవీ ఎక్కువగా చూడడం, స్మార్ట్‌ఫోన్‌కి అతుక్కుపోవడం నిజంగా దురలవాట్లే. వాటి విషయంలో మాత్రం మీరు కొన్ని నియమాలు పెట్టాల్సిందే.. కానీ ఆ నియమాలపై మరీ పంతంపట్టకండి. అతిక్రమశిక్షణ పేరుతో వాళ్లకిష్టమైనవాటిని దూరం చేయకండి. అలా చేస్తే.. వాళ్లు వాటిని చూడడానికి వేరే దార్లు వెతుక్కుంటారు. ఇంకేముంది.. ఆ చిన్న వయసులో అనవసరమైన దాపరికాలు నేర్చుకోవడం మెుదలపెడతారు.