Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు స్మార్ట్ ఫోన్ అలవాటు చేస్తున్నారా?కళ్లల్లోని తడి ఆరిపోతే అంతే?

స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణమైనా ఉండలేకపోతున్నారు.. చాలామంది. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్ విడుదల చేసే రేడియేషన్‌‌తో మెదడు పనితీరు మందగిస్తు

Written By selvi
Updated: శుక్రవారం, 3 నవంబరు 2017 (14:09 IST)
స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణమైనా ఉండలేకపోతున్నారు.. చాలామంది. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్ విడుదల చేసే రేడియేషన్‌‌తో మెదడు పనితీరు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే పెద్దల్లోనే కాకుండా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్ లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పిల్లలు, యువత స్మార్ట్ ఫోన్లను అత్యధికంగా వాడటం ద్వారా వారిలో కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
కంటితో తదేకంగా స్మార్ట్ ఫోన్లను చూడటం ద్వారా కళ్లల్లోని తడి ఆరిపోతుందని తద్వారా కళ్ల మంటలు, అలసట, మెడనొప్పి తప్పట్లేదు. ఇవి కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌‌కు కారకాలవుతున్నాయి. ట్యాబ్‌, కంప్యూటర్లను ఎక్కువగా వినియోగించే వారిలోనే ఈ సమస్యలు వస్తున్నాయి. దీనినే సింపుల్‌గా కళ్లు పొడిబారడం (డ్రై ఐస్‌) అని కూడా పిలుస్తారు.

కంటిపాపను ఆడించే సహజ ప్రక్రియ ద్వారా తేమ ఉత్పత్తి అవుతుంది. కానీ రెప్ప వాల్చకుండా తదేకంగా చూస్తే మాత్రం తేమ తగ్గి కళ్లు పొడిబారి పలు రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే చిన్నపిల్లలను స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. 
 
యువత అవసరానికి మించి స్మార్ట్‌ఫోన్ల వినియోగం తగ్గించాలి. ఎక్కువసార్లు కంటి రెప్పలను ఆర్పుతుండాలి. కంప్యూటర్‌పై ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు కనీసం గంటకోసారి ఐదు నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకోవాలి. మంచి నీటిని ఎక్కువగా తాగుతుండాలి. దీనివల్ల కొంతైనా నీటిశాతం పెరిగే అవకాశముంది. కంప్యూటర్‌, ఫోన్లను ఎక్కువ సమయం ఉపయోగించాల్సి వస్తే..స్క్రీన్ లైటింగ్‌ తగ్గించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

వివాహితతో ఎఫైర్‌ను కప్పిపెట్టేందుకు ఆమె తవ్విన గోతిలో ఆమెనే పాతిపెట్టిన పోలీసు

రూ. 1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు.. విజయ్ సర్కారుపై ట్రోల్స్, ప్రశ్నల వర్షం

ఆస్తి కోసం కొడుకు ఘాతుకం - శవాన్ని కూడా వదల్లేదు... చనిపోయిన తండ్రి చేతి వేలిముద్ర తీసుకున్నాడు..

ఇండిగో విమానం రద్దు - లగేజీ బెల్ట్ ఎక్కి మహిళ నిరనస (వీడియో)

ఇంటి ముందు పబ్లిక్ రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే రూ.25 వేలు పార్కింగ్ రుసుం

అన్నీ చూడండి

Agadha Movie Review: ఎం.ఎస్.రాజు తీసిన అగథ మెప్పించిందా ? లేదా?

రజనీకాంత్, కమల్ హాసన్ ధర్మన్ రెండవ షెడ్యూల్ ప్రారంభం

హుషార్ పిట్టలు కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది :వెంకట్‌ యాదవ్‌

Nag: కన్స్యూ మర్ యాప్ ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కి నేని నాగార్జున

Kamakshi Bhaskarla: వద్దు అని నా ముందే అన్నారు,అదే చేదు అనుభవం : కామాక్షి భాస్కర్ల

తర్వాతి కథనం
Show comments