సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (08:11 IST)

సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్...

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 23వ తేదీన లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశమంతా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
 
మరోవైపు, తుది దశ పోలింగ్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 246లో ఆయన ఓటు వేశారు. దేశవ్యాప్తంగా 59 ఎంపీ స్థానాలకు ఆదివారం  పోలింగ్ జరుగుతోంది. ఓటర్లంతా ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. 
 
ఆదివారం ఈ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనుంది. ఈసారి 59 ఎంపీ స్థానాలకు 918 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు 483 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్ సభ స్థానాలకు, పంజాబ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 9, మధ్యప్రదేశ్‌లోని 8, బీహార్‌లోని 8, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, జార్ఖండ్‌లోని 3, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది.