శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 10 మే 2019 (14:09 IST)

భర్త శవాన్ని ఇంటిలో పెట్టుకుని ఓటు వేసి వచ్చిన భార్య... ఎక్కడ?

సాధారణంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది బద్ధకం చూపుతుంటారు. ఏదైనా పనులు ఉంటే అస్సలు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. ఓటు విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తారు. కొంతమంది అయితే ఏకంగా ఓటు అసలు ఎందుకు వేయాలని.. ఏ రాజకీయ నాయకుడికి ఓటు వేసినా ఉపయోగం ఉండదని భావించి ఓటెయ్యరు. కానీ ఒక మహిళ తన భర్త చనిపోయినా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి తన ఓటు హక్కును వినియోగించుకుంది. 
 
మహబూబ్ నగర్ జిల్లా పేరూరులో భర్త మృతి చెందినా ఓటు హక్కు వినియోగించిన ఓ మహిళ ఆదర్శంగా నిలిచింది. పేరూరు నుంచి హైదరాబాదుకు వలస వెళ్ళిన దంపతులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. భర్త శ్రీనివాస్ అస్వస్థతకు గురయి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయినాసరే ఆ మహిళ భర్త చనిపోయాడన్న విషయాన్ని దిగమింగుకుని తన ఓటు హక్కును వినియోగించుకుంది.