బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (20:16 IST)

కేంద్రంలో ఎన్డీఎ - రాష్ట్రంలో ఫ్యాన్ గాలికి సైకిల్ ఎగిరిపోయింది... ఎగ్జిట్ పోల్స్

ఎన్నికలు ముగిశాయి. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. వీటిలో మళ్లీ ఎన్డీఏకే ప్రజలు పట్టం కడుతున్నారని తేల్చాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిల్ ఎగిరిపోయిందంటూ పోల్స్ వివరాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఐతే అసలు ఫలితాలు ఏమిటన్నది తెలియాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే.
కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావొచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా, సీ ఓటరు, రిపబ్లిక్ టీవీ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. సీ ఓటరు సర్వేలో ఎన్డీయేకు 287, యూపీపీఏకు 128, ఇతరులకు 87 సీట్లు వస్తాయని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ సర్వే నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 305, యూపీఏ 124, ఇతరులు 84, ఎస్పీ, బీఎస్పీ కూటమికి 42 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి.