బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Modified: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (13:05 IST)

ఖైరతాబాద్ నియోజకవర్గంలో ‘నమో ఎగైన్’ అవగాహన కార్యక్రమం

నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని కావాలని 'నమో ఎగైన్' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ఎన్నికల వేళ జనంలో అవగాహన కల్పిస్తోంది. సికింద్రాబాద్ నియోజక వర్గంలో కిషన్ రెడ్డి ఎంపీ కావాలంటూ స్థానిక శ్రీనగ్ కాలనీ, అమీర్ పేట్, జూబ్లీ హిల్స్‌లో 100 మందికి పైగా వాలంటీర్లు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  గడిచిన ఐదేళ్లో మోదీ దేశానికి చేసిన సేవలను వాళ్లంతా ఇంటింటికీ చేరి వివరిస్తున్నారు. 
 
“మోదీ మరోసారి ప్రధాని అయితే దేశ రూపురేఖలు మారిపోతాయి. మన తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి లాంటి వ్యక్తి ఎంపీ అయితే క్యాబినేట్లో మనకు సముచిత స్థానం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం,” అని చెప్పారు అరుల్ రాజ్. నమో ఎగైన్ 2019 వ్యవస్థాపకుల్లో అరుల్ రాజ్ ఒకరు. దీంతోపాటు యువకులకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే మరో ఐదేళ్లు మోదీ ప్రధాని కావాలని ఆయన చెప్పుకొచ్చారు.
 
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది. “ఏడాది క్రితమే మేమీ క్యాంపైన్ మొదలుపెట్టాం. ఇప్పుడు ఎన్నికలు రావడంతో మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాం. మోదీ లాంటి నాయకులు దశాబ్దాల కాలంలో ఒక్కసారి వస్తుంటారు. వారి పాలన ఎక్కువకాలం కొనసాగితే దేశానికి మంచి జరుగుతుంది,”  అని రాజా వివరించారు.
 
ఎక్కువమంది యువకులు మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకోవడం సంతోషంగా ఉందని అన్నారాయన. దీంతో పాటు స్థానికంగా ఓటర్లను కలసి వారికి నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అయితే ఏఏ అంశాల్లో భారత దేశం ప్రగతి పదంలో దూసుకు పోతుందనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. దేశ ప్రయోజనాలే ప్రధానంగా జరుగుతున్న ఈ అవగాహనకు అనూహ్య స్పందన  వస్తోంది.  మేం ఇళ్లకు వెళ్లి చెప్పే లోపే జనం మాకు చెబుతుందటం ఎంతో సంతోషంగా ఉంది,” అశోక్ పట్నాయక్.
 
నమో ఎగైన్ క్యాంపైన్‌కు కన్వీనర్‌గా వ్యవవహరిస్తున్న పట్నాయక్ జనంలో మోదీపై ఉన్న ఫాలోయింగ్ గురించి తెలియజేశారు. మాతో జాయిన్ అవ్వడానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్నవారితో మాత్రమే కార్యక్రమం చేస్తున్నాం. మోదీ హైదరాబాద్ సభ తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తాం. ఎన్నికల లోపు మోదీపై మరింత అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నాం. ఇంటింటికీ వెళ్లి వివరించే కార్యక్రమానికి మాత్రం విశేష స్పందన వస్తోందని నమో ఎగైన్ సభ్యలు వివరించారు.