శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (15:45 IST)

దాల్చిన చెక్క పొడితో ఫేస్‌ప్యాక్.. మొటిమలు మాయం..?

అందమైన ముఖంపై న‌ల్ల‌మ‌చ్చ‌లుంటే... అమ్మో ఇంకేమైనా ఉందా? ఎంత త‌ల‌వంపు అని యువ‌తలు త‌ల్లడిల్లిపోతుంటారు. చంద‌మామ‌కే మ‌చ్చ ఉంది... మ‌న‌కెంత అని వ‌దిలేయ‌లేం క‌దా. ఈ న‌ల్ల‌మ‌చ్చ‌లు మాయం కావాలంటే... ఓ చ‌క్క‌ని చిట్కా ఉంది.
 
దాల్చిన చెక్క‌ను మెత్త‌గా పౌడ‌ర్‌లా చేసుకోవాలి. ఆ పొడిని ఒక గాజు పాత్ర‌లో వేసి అందులో కొంచెం తేనె క‌ల‌పాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖంపై గల నల్లటి మచ్చలు పోతాయి.  
 
దాల్చిన చెక్కను మెత్త‌గా పేస్టులా త‌యారుచేసుకోవాలి. దానిలో కొంచెం నిమ్మ‌ర‌సం, ప‌సుపు కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి ప‌ట్టించి.. ముఖ్యంగా న‌ల్ల మ‌చ్చ‌లున్నచోట ప‌ట్టించి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
రాత్రి దాల్చిన చెక్క పేస్ట్ రాసుకుని ఉద‌యాన్నే గోరువెచ్చ‌ని నీటితో క‌డుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే న‌ల్ల‌మ‌చ్చ‌లు మూడో రోజే త‌గ్గ‌డం, మ‌రికొద్ది రోజుల‌కు క‌నుమ‌రుగ‌వ‌డం మీరు గ‌మ‌నిస్తారు. దీని కోసం మార్కెట్లో ఉండే కెమిక‌ల్స్ క‌లిసిన ఫేస్ క్రీములు వాడాల్సిన ప‌నిలేదు.