మంగళవారం, 28 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:00 IST)

టమోటాతో ఇలా చేస్తే.. ఏమవుతుందో తెలుసా..?

టమోటాల్లో లికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఒక సన్ స్క్రీన్‌లా పనిచేస్తుంది. బాడీకేర్ విషయంలో టమోటా ఆహార రూపంలో తీసుకోవడం లేదా టమోటా రసాన్ని చర్మానికి అప్లై చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే చర్మం రంధ్రాలను నివారించడానికి టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం చేర్చి.. రెగ్యులర్‌గా చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మ రంధ్రాలను కుంచించుకుపోయేలా చేస్తుంది.
 
ఓ చిన్న టమోటాను తీసుకుని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ టమోటా ముక్కతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. 5 నిమిషాల పాటు అలానే చేయాలి. అరగంట అలానే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా మృదువుగా తయారవుతుంది.
 
టమోటాలో ఉన్న విటమిన్ ఎ, సి చర్మ సంరక్షణకు ఎంతగానే తోడ్పడుతుంది. టమోటాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ సెల్యులార్ డ్యామేజ్‌తో పోరాడుతుంది. శరీరంలోని ప్రీరాడికల్స్‌ను నివారించడంతో చిన్న వయస్సులోనే ఏర్పడే వృద్ధాప్య ఛాయలను నివారిస్తుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. 
 
మొటిమలు, మచ్చలు నివారించకోవడానికి చాలా మంది అనేక విధాలుగా టెక్నిక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే ఓసారి టమోటాను వాడి చూడండి. బాడీకేర్‌లో టమోటాలను ఉపయోగించడంలో మొటిమలను నివారిస్తుంది.