1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 14 మే 2024 (11:52 IST)

PM Modi Nomination: మోడీ ఈసారి గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు వుండవంటున్న ఖర్గే

Narendra Modi
నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలనేవి జరగకుండా చేస్తారనని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీది నియంతృత్వ పోకడ అనీ, అలాంటివారికి తప్పకుండా బుద్ధి చెప్పి గద్దె నుంచి దించేయాలని పిలుపునిచ్చారు.
 
మోడీకి దమ్ముంటే పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలు అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈమేరకు ఆయన వ్యాఖ్యలు చేసారు. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సోరెన్ ను అరెస్టు చేసినట్లుగా అంబానీ, అదానీలను అరెస్ట్ చేసే సత్తా వారికి వుందా అని ప్రశ్నించారు.
 
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అరెస్టయిన నాయకులందరినీ బయటకు తీసుకుని వస్తామని అన్నారు. నరేంద్ర మోడీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై వున్నదంటూ పిలుపునిచ్చారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు.