సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (09:40 IST)

ఉత్తర కాశీలో భూకంపం - 2.5 తీవ్రతతో కంపించిన భూమి

earthquake
ఈ మధ్యకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోమారు భూకంపం సంభవించింది. మూడు రోజుల వ్యవధిలో ఇక్కడ రెండోసారి భూమి కంపించింది. ఉత్తర కాశీలో భూకంప లేఖినిపై 2.5 తీవ్రతో భూమి కంపించింది. ఇదే రాష్ట్రంలో గత గురువారం పౌరి గర్వాల్ జిల్లాలో 2.4 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెల్సిందే. గతయేడాది డిసెంబరు నెలలో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూప్రకంపనలు కనిపించాయి. 
 
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన పెను భూకంపంలో దాదాపుగా 50 వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అధిక ప్రాణనష్టం టర్కీ దేశంలోనే జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూమి కంపించింది.
 
అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్‌ జిల్లాలో గురువారం 2.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు గత యేడాది డిసెంబరులో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూమి కంపించింది ఇపుడు మరోమారు భూమి కంపించింది.