ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (20:31 IST)

ప్రమోషన్ కోసం బాస్‍‌కు పడక సుఖం ఇవ్వమంటున్న భర్త... కోర్టుకెక్కిన భార్య.. ఎక్కడ?

woman victim
తన ఉద్యోగ సుఖం కోసం ఓ భర్త ఇవ్వకూడని సలహా ఒకటి భార్యకు ఇచ్చాడు. ప్రమోషన్ వచ్చేందుకు వీలుగా తన బాస్‍తో ఒక రోజు రాత్రి గడపాలంటూ భార్యపై కట్టుకున్న భర్త ఒత్తిడి తెచ్చాడు. ఈ మాటలు జీర్ణించుకోలేని భార్య ఆ పాడు పని చేసేందుకు ససేమిరా అంది. కానీ, భర్త మాత్రం ఏమాత్రం వినిపించుకోకుండా ప్రమోషన్ కోసం బాస్‌తో ఒక్క రాత్రి గడపాల్సిందేనంటూ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆ మహిళ ఏకంగా కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పూణెకు చెందిన అమిత్ చాబ్రా అనే వ్యక్తి తాను పని చేస్తున్న సంస్థలో ప్రమోషన్ కోసం తన బాస్ వద్ద ఒక్క రాత్రి గడిపితే తనకు ప్రమోషన్‌తో పాటు ఇతర సౌకర్యాలు భారీగా లభిస్తాయని అందుకు సమ్మతించాలంటూ భార్యను బలవంతం చేశాడు. అంతేకాకుండా, అన్న వాలకం తెలుసుకున్న అతని తమ్ముడు కూడా వదిన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలా పలుమార్లు నడుచుకున్నాడు. 
 
అటు భర్త... అటు మరిది ఒత్తిడి, వేధింపులను భరించలేని ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. తనకు 12 యేళ్ల కుమార్తె ఉందని, కుమార్తె ఎదుటే తన మరిది రాజ్ చాబ్రా కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొంది. అంతేకాకుండా, తన భర్త కూడా అతని బాస్‌కు పడక సుఖం ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని, వీరిద్దరి ఒత్తిళ్లకు తాను లొంగకపోవడంతో తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ వేధింపులు భరించలేక గత యేడాది ఇండోర్‌లోని పుట్టింటికి వెళ్లిపోయినట్టు చెప్పింది. ఆ తర్వాత ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారని, పిమ్మట తనను కొట్టనని లిఖితపూర్వరక హామీ ఇచ్చారని ఆ మహిళ వెల్లడించింది. దీంతో తాను మళ్లీ కాపురానికి వెళ్లినట్టు, ఇపుడు మళ్లీ వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఈ పిటషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు భర్త అమిత్, మరిది రాజ్‌లపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.