శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2024 (12:11 IST)

హర్యానాలో స్కూల్ బస్సు ప్రమాదం- ఆరుగురు మృతి- తల్లిదండ్రులతో పాటు..?

Schoolbus Overturns In Haryana
Schoolbus Overturns In Haryana
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఓవర్‌లోడ్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
 
గాయపడిన 12 మంది విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో రోహ్‌తక్‌ ఆస్పత్రికి తరలించారు. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఇంకా డ్రైవర్ మద్యం సేవించి వుండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. 
 
ఇక స్కూల్ బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళుతుండగా బైక్ ఢీకొనడంతో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో విద్యార్థిని తల్లి కాలు విరగగా, ఆమె సోదరి కూడా మృతి చెందింది.