శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (11:05 IST)

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు భక్తుల దుర్మరణం

road accident
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కొంతమంది భక్తులతో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ను ట్రక్కు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు దుర్మణం పాలయ్యారు. ఈ ఘోరం శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లా సుమేర్‌పూర్ వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలికి చెందిన కొందరు భక్తులు ట్రాక్టర్‌లో జైసల్మేర్‌లో రామ్ దేవ్రాకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ ట్రాక్టర్ సుమేర్ పూర్ వద్ద వస్తుండగా ఎదురుగా అమిత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపది ధన్‌కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.