యూపీ: కోల్డ్ స్టోరేజ్‌లో పైకప్పు కూలి ఎనిమిది మంది మృతి
యూపీలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఓ కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు. 11మందిని సురక్షితంగా కాపాడగలిగారు.
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఓ కోల్డ్ స్టోరేజ్ పై కప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చందౌసీలో ఉన్న ఈ కోల్డ్ స్టోరేజీలో బంగాళా దుంపలను నిల్వ చేస్తూ ఉంటారు.
పై కప్పు కుప్పకూలినట్లు సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్పీ), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు తరలి వెళ్లి, సహాయక చర్యలను ప్రారంభించాయి.
మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారని చెప్పారు. 11 మందిని ప్రాణాలతో కాపాడగలిగామన్నారు.