1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (09:31 IST)

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

road accident
కర్ణాటక రాష్ట్రంలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ - జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో జీపులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.