గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (14:01 IST)

ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు విద్యార్థుల దుర్మరణం

school van accident
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగ్దా - ఉన్హేల్‌ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ ఒక స్కూలు వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉజ్జయిని జిల్లాలోని నగ్దా ప్రాంతంలోనున్న ఒక కాన్వెంట్​ వ్యాన్​ పిల్లలతో సహా స్కూల్​కు బయలుదేరింది. మార్గ మధ్యలో రాంగ్ రూట్‌లో వస్తున్న ఒక లారీ​ వేగంగా వచ్చిన స్కూలు వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూలు వ్యాను నుజ్జు నుజ్జు అయిపోయింది. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అంబులెన్స్​ అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులను ఉజ్జయిన వైపు వెళ్తున్న బస్సులో చికిత్స కోసం తరలించారు.