ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (14:52 IST)

పిడుగుపాటుకు వ్యక్తి మృతి.. ఆకాశం నుంచి మెరుపు వేగంతో...

thunderstorm
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెకన్ల వ్యవధిలోనే ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
 
ఈ వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని భద్రావతి తాలూకా మాజ్రీ బొగ్గు గనిలో పనిచేస్తున్న కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
 
తన డ్యూటీ పూర్తవడంతో పని ప్రదేశం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అంతలో ఆకాశం నుంచి ప్రకాశవంతమైన మెరుపు అతనిపై పడింది. పిడుగు పాటుతో ఆ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.