గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (08:31 IST)

విమానాశ్రయంలోకి ఎంట్రీ ఇచ్చిన వానరం... డ్రింక్ స్టాల్ వద్ద..

ఇటీవలి కాలంలో క్రూరజంతువులు, మూగజీవాలు జనసంచార ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. వీటిలో కొన్ని క్రూరమృగాలు మనుషులపై దాడి చేసి చంపేస్తున్నాయి. మరికొన్ని మూగజీవులు మనుషుల చేతుల్లో వున్న ఆహార పదార్థాలను ఎత్తుకెళుతున్నాయి. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.
 
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వచ్చిన ఓ కోతి నానా రచ్చ చేసింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌.. ప్రయాణికులంతా విమానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ.. ఓ కోతి ఎంచక్కా ఎయిర్‌ పోర్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 
 
హై సెక్కూరిటీ ఎరియాగా ఉండే ఎయిర్‌ పోర్ట్‌లో ఎంతో మంది భద్రతా సిబ్బంది కళ్లను కప్పిన వానరం హుందాగా ఎంట్రీ ఇచ్చింది. అక్కడితో ఆగని ఆ వానరం.. ఓ డ్రింక్‌ స్టాల్‌ వద్ద ఆగమాగం చేసింది. తనకు అందిన శీతలపానీయాలు, జ్యూస్ బాటిళ్లను తీసుకుని ఎంచక్కా తాగేసింది. అలాగే, తన వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.