శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 13 డిశెంబరు 2018 (15:44 IST)

నాకు కోరికెక్కువ.. నా మొగుడు డబ్బు చూస్తూ నిద్రపోతున్నాడు.. ఏం చెయ్యాలి?

పెళ్ళి తరువాత మొగుడుతో సంసార జీవితాన్ని సాఫీగా కొనసాగించాలని ఏ భార్య అయినా కలలు గంటుంది. పెళ్ళయిన కొన్ని జంటలు చనిపోయేంత వరకు కలిసి ఉంటే మరికొన్ని జంటలు అర్థాంతరంగా విడిపోతుంటారు. కుటుంబ కలహాలో, లేకుంటే మనస్ఫర్థలో ఇలా ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ రెండుగా విడిపోతుంటారు. భార్యాభర్తలు విడిపోవడానికి సంసారంలో ఇద్దరూ ఎంజాయ్ చేయకపోవడం.. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి. 
 
కానీ ఒక వివాహిత తన వైవాహిత జీవితంలో ఎదుర్కొంటున్న బాధను సిగ్గు విడిచి చెప్పుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి అతి సమీపంలోని మారియమ్మన్ గ్రామమది. సరిగ్గా మూడు నెలల క్రితం మురుగన్, ఈశ్వరిలకు వివాహమైంది. ఈశ్వరిది స్వస్థలం చిత్తూరు జిల్లాలోని నగరి. 
 
మురుగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించేవాడు. అయితే ఎప్పుడూ డబ్బు మీద ధ్యాసే. పెళ్ళయిన మూడునెలలు అవుతున్నా ఈశ్వరితో సంసారం చేసింది చాలా అరుదు. ఎప్పుడూ చూసినా స్థలం చూసేందుకు పార్టీ వచ్చింది వెళుతున్నానంటూ వెళ్ళిపోయేవాడు. అర్థరాత్రి దాటిన తరువాత ఇంటికి వచ్చి స్థలం అమ్మి వచ్చిన డబ్బును చూస్తూ నిద్రపోతున్నాడు. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు అంటోంది ఈశ్వరి. నా మొగుడిని మార్చాలంటే ఏం చేయాలని అక్కడి గ్రామ పెద్దలకు మొరపెట్టుకోవడం చర్చనీయాంశమైంది.