సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (09:37 IST)

క్రెడిట్‌ కార్డు పరిమాణంలో ఆధార్‌

ఆధార్‌ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది.

పాలి వినైల్‌ క్లోరైడ్‌(పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ. 50గా నిర్ణయించారు. ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు https://uidai.gov.in/   వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేసి చరవాణికి వచ్చే ఓటీపీని నమోదు చేయాలి.

ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు ధరను డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, నెట్‌బ్యాంకింగ్‌తో చెల్లించాలి. ఆ తరువాత ఆధార్‌కార్డులో పేర్కొన్న చిరునామాకు కొత్త కార్డును యూఐడీఏఐ పది రోజుల్లో స్పీడ్‌ పోస్టు ద్వారా పంపుతుంది.